![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -129 లో.....వేదవతి చేత ఎక్కువ రేట్ కి పెట్టి చీరలు కొనిపించాలి. నేను వాళ్లకి తక్కువ రేటున్న చీరలు కొనాలని భాగ్యం ప్లాన్ వేస్తుంది. అందులో భాగంగా కామాక్షి, అమూల్యలకి తక్కువ రేట్ చీరలు కొంటుంది. ఇక వేదవతి ని మాటలతో మభ్యపెట్టి తనకి తక్కువ రేట్ చీరలు కొంటుంది. దాంతో వేదవతి ఏమనలేకపోతుంది.
మరొకవైపు నర్మదని ప్రేమ పక్కకి తీసుకొని వస్తుంది. చూసావా ఆ భాగ్యం అత్తయ్య.. వాళ్ళకి చీప్ రేట్ లో సారీస్ తీసుకొని వీళ్లకేమో లక్షలో తీసుకుంటుందని ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేస్తారు. ఆ తర్వాత భాగ్యం వేల రేటున్న చీరలు సెలక్ట్ చేసుకుంటుంది. ప్రేమ, నర్మద కలిసి తక్కువ రేట్ చీరకు లక్షల చీర అన్నట్లు స్ట్రిక్కెర్ అంటిస్తారు. భాగ్యం వాళ్ళ దగ్గరికి వచ్చి పిన్ని గారు అక్కడ చీరలు బాగున్నాయంటూ వాళ్ళు స్టిక్కర్ అంటించిన దగ్గరికి తీసుకొని వెళ్లి చూపిస్తారు. చీరలు ఏంటి చీప్ గా ఉన్నాయని భాగ్యం అంటుంది. రేట్ చుడండి అనగానే భాగ్యం రేట్ చూసి చాలా కాస్లీ అని అనుకుంటుంది. ఇవే తీసుకుంటానని భాగ్యం అంటుంది.
ఏం చేస్తున్నారు మీరు అంటూ వేదవతి తన కోడళ్ళని అడుగుతుంది. ఏం చెయ్యడం లేదు తర్వాత అర్ధమవుతుందని వాళ్ళు అంటారు. ఆ తర్వాత ప్రేమని ధీరజ్ పక్కకు తీసుకొని వెళ్లి.. నువ్వు కూడ చీర తీసుకో అంటాడు. నాకు మీ నాన్న అన్న మాటలు గుర్తున్నాయ్.. నేను కొనుక్కోను.. నువ్వు కోనివ్వమని ప్రేమ అంటుంది. నా దగ్గర వెయ్యి పదిహేను వందలున్నాయని ధీరజ్ అనగానే వాటితోనే కోనివ్వమని ప్రేమ అంటుంది. తరువాయి భాగం లో ప్రేమకి ధీరజ్ చీర సెలక్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |